- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా పాపకు న్యాయం చేయండి
నూరేళ్ళు బతకాల్సిన శిశువు అసాధారణంగా జన్మించడంతో బాధిత కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది.

మా పాపకు న్యాయం చేయండి
- డాక్టర్ నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన బాధితులు
- శిశువు అసాధారణ జననంతో బంధువుల ధర్నా...
దిశ, నర్సంపేట: నూరేళ్ళు బతకాల్సిన శిశువు అసాధారణంగా జన్మించడంతో బాధిత కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... గీసుగొండ మండలం కొమ్మాల సమీపంలోని సింగ్యా తండాకు చెందిన బానోతు రమ్య-నవీన్ దంపతులు గత తొమ్మిది నెలల నుండి నర్సంపేట పట్టణంలోని జననీ నర్సింగ్ హోంలో వైద్య సేవలు పొందుతున్నారు. శిశువు ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి అవలక్షణాలు లేనట్లు డాక్టర్ నవత తెలిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 8న జననీ ఆస్పత్రిలో రమ్య ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు అసాధారణంగా కంతితో పుట్టడంతో సదరు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం చికిత్స కోసం కేఎంసీకి రిఫర్ చేసినట్లు బాధితులు తెలిపారు. వారం తర్వాత తీసుకురావాలని అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ అనిచెప్పడంతో పాప కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సదరు జననీ నర్సింగ్ హోమ్ కి చేరుకున్నారు. డాక్టర్ నవతను పరిస్థితి గురించి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు ఆరోపించారు. ఆస్పత్రిలో ఉండాల్సిన రేడియోలజిస్ట్ సరిగ్గా విధులు నిర్వహించలేదని ఆరోపించారు. జననీ నర్సింగ్ హోమ్ పై , విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ నవతపై జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాపను బతికించాలని, మెరుగైన చికిత్స అందించాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై ఆస్పత్రి డాక్టర్ నవతను వివరణ కోరేందుకు ప్రయత్న చేయగా అందుబాటులో ఉండక పోవడం గమనార్హం.






