విద్యార్థులకు టీ షర్టుల పంపిణీ

by velandi.Saikiran |

ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు డి.టి.ఎఫ్. జిల్లా కౌన్సిలర్ మడక మధు తన సొంత ఖర్చులతో టీ-షర్టులను అందజేశారు.

విద్యార్థులకు టీ షర్టుల పంపిణీ
X

దిశ, మహదేవపూర్: మండలంలోని ఎంపీపీఎస్ పెద్దంపేట, ఎంపీపీఎస్ రాపల్లికోట ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు డి.టి.ఎఫ్. జిల్లా కౌన్సిలర్ మడక మధు తన సొంత ఖర్చులతో టీ-షర్టులను అందజేశారు. పెద్దంపేట పాఠశాలలో జరిగిన పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి బీసుల లావణ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు టీ-షర్టులను పంపిణీ చేశారు.

డి.టి.ఎఫ్. జిల్లా కౌన్సిలర్ మడక మధు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికే ఈ చిన్న ప్రయత్నమ‌న్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మండల DTF ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షులు సాయికుమార్, రామమూర్తి, ఎం.పి.పి.ఎస్ పెద్దంపేట ప్రధానోపాధ్యాయులు బిక్షపతి, ఎం.పి.పి.ఎస్ రాపల్లికోట ప్రధానోపాధ్యాయురాలు యాస్మిన్, ఉపాధ్యాయులు రూప, మమత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Next Story