- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనం అక్షర సత్యం.. వీడిన మిస్టరీ..!
మరొకరితో చనువుగా ఉంటూ, తనను దూరం పెడుతుందనే అనుమానంతో ప్రియుడే హత్యకు పాల్పడినట్టు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.

దిశ, నర్సంపేట : మరొకరితో చనువుగా ఉంటూ, తనను దూరం పెడుతుందనే అనుమానంతో ప్రియుడే హత్యకు పాల్పడినట్టు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 22న పోలీసుల అదుపులో నిందితుడు..? అంటూ దిశ కథనం వెల్లడించింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచురించిన విషయం తెలిసిందే. అతడే హత్యకు పాల్పడినట్టు ఏసీపీ స్పష్టం చేశారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు ఏసీపీ రవీందర్ రెడ్డి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్ళపల్లి సుమలత ఈ నెల 20న అనుమాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. అదే గ్రామానికి చెందిన పాండవుల సురేష్ తో సుమలతకు గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గత కొద్ది రోజులుగా సుమలత సురేష్ పట్ల ఆసక్తి కనబరచకపోవడం, ఫోన్ కాల్స్ బిజీ వస్తుండటం సురేష్ కి మరింతగా అనుమానం పెరిగిపోయింది. ఈ క్రమంలో సుమలత దృష్టిలో తన ప్రాధాన్యత తగ్గి పోతోందని ఆవేశంలో తనని చంపాలని పథకం వేశాడు.
ఈ నెల 20న వరంగల్ కి రమ్మని పిలిచాడు. సాయత్రం ఇద్దరూ కలిసి బైక్ మీద లక్ష్మీపురం గ్రామానికి బయలుదేరారు. అప్పటికే ముందస్తు ప్రణాళికలో భాగంగా సురేష్ కాశీబుగ్గలో కత్తిని కొనుగోలు చేశాడు. బుధవారం రాత్రి లక్ష్మీపురం శివారు కెనాల్ కాలువ దగ్గరికి చేరుకున్నాక ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న సురేష్ ఆమెపై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. విచారణ చేపట్టిన పోలీసులు కొద్ది గంటల్లోనే సాంకేతిక ఆధారాలను సేకరించారు. పాండవుల సురేష్ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాల్ డేటా, సీసీ కెమెరాల సాయంతో మరింత ఆధారాలను సేకరించి సురేష్ ఒకడే ఘటనలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఏసీపీ తెలిపారు. రూరల్ సీఐ సాయి రమణ, దుగ్గొండి ఎస్సై రణధీర్ లను ఏసీపీ అభినందించారు.






