- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
గోపాల్ పూర్ ఊర చెరువు పూడికతీత పనులు, రిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: గోపాల్ పూర్ ఊర చెరువు పూడికతీత పనులు, రిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం హనుమకొండ గోపాల్ పూర్ లోని ఊర చెరువు పూడికతీత, రిటైనింగ్ వాల్ పనుల పురోగతిని సాగునీటిపారుదల, మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ పూడికతీత, రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. అభివృద్ధి పనుల వేగవంతానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ ఈ రాజ్ కుమార్, ఈఈ రవికుమార్, సాగునీటి పారుదల శాఖ ఈఈ కిరణ్ కుమార్, హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






