బంగారం ఇస్తామ‌ని మోసం

by Bhanu |

పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన సింగపురం గౌరమ్మ ,భర్త సింగపురం వెంకటయ్యలు పాలకుర్తి మండల చుట్టుపక్కల గ్రామల ప్రజల వద్దకు వెళ్లి వారికి బంగారం దొరికిందని కొంత డబ్బులు చెల్లిస్తే అందులో కొంత బంగారం మీకు ఇస్తామని అమాయక ప్రజలను నమ్మించి వారి వద్ద డబ్బులు తీసుకొని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు.

బంగారం ఇస్తామ‌ని మోసం
X

దిశ, పాలకుర్తి : పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన సింగపురం గౌరమ్మ ,భర్త సింగపురం వెంకటయ్యలు పాలకుర్తి మండల చుట్టుపక్కల గ్రామల ప్రజల వద్దకు వెళ్లి వారికి బంగారం దొరికిందని కొంత డబ్బులు చెల్లిస్తే అందులో కొంత బంగారం మీకు ఇస్తామని అమాయక ప్రజలను నమ్మించి వారి వద్ద డబ్బులు తీసుకొని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. నిందితులు బొమ్మగాని పద్మ వద్ద రూ.4,74 ,000 రూపాయలు, మంద రజిత వద్ద రూ.6,07,000 గాదం జయ వద్ద రూ.5,93 100లు , జఫర్గడ్ మండలం కోణాచలంకు సంబంధించిన సుమారు నలుగురు మహిళల వద్ద సుమారు 15 లక్షల రూపాయల వరకు బంగారం ఇస్తానని ఇదేవిధంగా మోసం చేశారు. గూడూరుకు చెందిన మంద రజిత ఫిర్యాదు మేరకు ఎస్ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. ఎవరైనా ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో అక్రమంగా బంగారం దొరికిందని ప్రజల వద్ద నమ్మించి మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజకుమార్ హెడ్ కానిస్టేబుల్ సోమిరెడ్డి రైటర్ యాకయ్య పాల్గొన్నారు.

Next Story