ఉత్కృష్ట పతకాన్ని అందుకున్న డీసీపీ రాజమహేంద్ర నాయక్

by Ratna Kumari |

పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట పతకాన్ని బుధవారం సీపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ అందజేశారు.

ఉత్కృష్ట పతకాన్ని అందుకున్న డీసీపీ రాజమహేంద్ర నాయక్
X

దిశ, వరంగల్ బ్యూరో : పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట పతకాన్ని బుధవారం సీపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డీసీపీకి అభినందనలు తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులకు శాఖ పరమైన గుర్తింపుతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కూడా లభిస్తుందని అన్నారు. డీసీపీ 2010 డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరిన రాజమండ్రి నాయక్ నెల్లూరు, వరంగల్ సీసీఎస్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో డీఎస్పీగా పని చేసి 2017 అదనపు ఎస్పీగా భూపాలపల్లి, ఇంటెలిజెన్స్ పని చేసి, 2021లో ఎస్పీ పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ డీసీపీ ఎంతో సమర్ధవంతంగా పనిచేయడమే కాకుండా.. తాను పని చేసిన సమయంలో ఎన్నో కీలక కేసులను పరిష్కరించడం డీసీపీ రాజ మహేంద్ర నాయక్ కీలకంగా నిలిచారు. ఈ సందర్బంగా వెస్ట్ జోన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది డీసీపీ కి అభినందనలు తెలిపారు.

Next Story