- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురు సర్పంచ్… తండ్రి ఉపసర్పంచ్..!
by Ratna Kumari |
దిశ, జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని వెంకిర్యాల గ్రామంలో రాజకీయ చరిత్రలో నిలిచే సంచలన ఘట్టం చోటు చేసుకుంది.

X
దిశ, జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని వెంకిర్యాల గ్రామంలో రాజకీయ చరిత్రలో నిలిచే సంచలన ఘట్టం చోటు చేసుకుంది. బీజేపీ తరఫున గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా ఘన విజయం సాధించగా, ఉపసర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా వార్డు మెంబర్ల ఓట్లు పడటం ఉత్కంఠకు దారి తీసింది.ఈ కీలక సమయంలో పార్టీ భేదాలను పక్కనపెట్టి, గ్రామ ప్రయోజనాలే లక్ష్యంగా అలేఖ్య నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తన తండ్రి గొల్లపల్లి వర్షయ్యకు మద్దతు ఇవ్వడంతో ఆయన ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.కూతురు సర్పంచ్‌గా, తండ్రి ఉపసర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టడం గ్రామ రాజకీయాల్లో అరుదైన ఘటనగా నిలిచి, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ ఐక్యత, రాజకీయ సమన్వయం కలిసి తీసుకొచ్చిన ఈ ఫలితం వెంకిర్యాల గ్రామానికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
Next Story






