- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకరంగా ప్రధాన రహదారి.. ఇంకాస్త కొట్టుపోతే అంతర్ జిల్లా రాకపోకలు బంద్
మంగపేట మండలంలోని గంపోనిగూడెం వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న ఏటూరునాగారం–సారపాక డబుల్ లేన్ అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి వరద ఉధృతికి గండిపడింది.

దిశ, మంగపేట : మంగపేట మండలంలోని గంపోనిగూడెం వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న ఏటూరునాగారం–సారపాక డబుల్ లేన్ అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి వరద ఉధృతికి గండిపడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సమీప అడవుల్లోంచి వచ్చిన వరద గిరిజన పెట్రోల్ బంక్ దగ్గర కల్వర్టు మీదుగా వేగంగా ప్రవహించింది. దీంతో రహదారి సగం నేలకొరిగిపోయి, దాని కింద ఉన్న 10 అడుగుల లోతైన భారీ సిమెంట్ మోరీలు బయటపడ్డాయి.
విషయం తెలుసుకున్న ఎస్సై టీవీఆర్ సూరీ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని గండికి గురైన ఏటూరునాగారం-సారపాక డబుల్ లేన్ రహదారి పరిశీలించారు. ప్రమాదాన్ని నివారించేందుకు రహదారి మధ్య భాగాన్ని బారికేడ్లతో తాత్కాలికంగా మూసివేశారు. వరద ప్రవాహం మరింత పెరిగితే ఈ మార్గం పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని, అటు ఉమ్మడి వరంగల్, ఇటు ఖమ్మం జిల్లాలు, అంతేకాదు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు స్తంభించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.






