మున్సిపాలిటీలో కరెంట్ కష్టాలు

by Ratna Kumari |

వెంకి పెళ్లి సుబ్బి చావు కు వచ్చింది అన్నచందంలా అభివృద్ధి పేరిట చేస్తున్న రోడ్ వెడల్పు కార్యక్రమం లో భాగంగా నూతన కరెంట్ పోల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. నూతన కరెంట్ పోల్స్ ఏర్పాటు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

మున్సిపాలిటీలో కరెంట్ కష్టాలు
X

దిశ‌, కేసముద్రం : వెంకి పెళ్లి సుబ్బి చావు కు వచ్చింది అన్నచందంలా అభివృద్ధి పేరిట చేస్తున్న రోడ్ వెడల్పు కార్యక్రమం లో భాగంగా నూతన కరెంట్ పోల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. నూతన కరెంట్ పోల్స్ ఏర్పాటు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. కారణం ఏది అయినప్పటికీ తరచు కరెంట్ పోవటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరచూ కరెంట్ పోవటం వలన వినియోగదారుల కూలర్ లు, ఫ్రిజ్ లు, వాషింగ్ మిషన్ లు మొదలగునవి కాలి పోయి మధ్యతరగతి ప్రజల్లో ఎంతో నష్టం వారిల్లుతున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిపేర్ ల కోసం నిర్ణీత సమయం లో కరెంట్ కోత విధించాలని.. ఆది కూడా ప్రజలకు సమాచారం ఇచ్చి కరెంట్ కోత విధించాలని ప్రజలు కోరుతున్నారు. కరెంట్ కోత వలన కాలి పోయిన విద్యుత్ ఉపకరణాల కు నష్టపరిహారం విద్యుత్ శాఖ వారు ఇస్తారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story