పాకాల ఎకో టూరిజం ముంద‌డుగు

by Ratna Kumari |

పాకాల ఎకో టూరిజం అభివృద్ధికి ముందడుగు పడింది. పాకాల సరస్సు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది.

పాకాల ఎకో టూరిజం ముంద‌డుగు
X

దిశ‌, ఖానాపురం : పాకాల ఎకో టూరిజం అభివృద్ధికి ముందడుగు పడింది. పాకాల సరస్సు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో పాకాల ఎకో టూరిజం అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పాకాల టూరిజం వెబ్‌సైట్‌, పాకాల టూరిజం వాట్సాప్‌ చాట్‌బాట్‌, పాకాల ఎకో టూరిజం డాక్యుమెంటరీతో పాటు పాకాల పర్యాటక బ్రోచర్లు గురువారం ఆవిష్కరించారు. పాకాల సరస్సు, అటవీ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్‌ వేదికలను రూపొందించినట్టు అధికారులు తెలిపారు.

పర్యాటకులకు అవసరమైన సమాచారం, జంగిల్‌ సఫారీ, బోటింగ్‌, ట్రెక్కింగ్‌, వసతి, పక్షుల వీక్షణ వంటి వివరాలు వెబ్‌సైట్‌, వాట్సాప్‌, చాట్ బాట్‌ ద్వారా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పాకాలను రాష్ట్రంలోనే ప్రముఖ ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పర్యాటకాభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పాకాల పక్షులు, సీతాకోక చిలుకలు, మగ్గర్ మొసళ్ల పై ప్రత్యేక బ్రోచర్లు విడుదల చేశారు. పాకాల జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన డాక్యుమెంటరీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్ ఐఏఎస్‌, పీసీసీఎఫ్‌ హెచ్‌ఓఎఫ్‌ సువర్ణ ఐఎఫ్‌ఎస్‌, పీసీసీఎఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వినయ్‌కుమార్ ఐఎఫ్‌ఎస్‌, పీసీసీఎఫ్‌ డెవలప్‌మెంట్‌ రత్నాకర్ జౌహరి ఐఎఫ్‌ఎస్‌, భద్రాద్రి సీసీఎఫ్‌ డాక్టర్ భీమా నాయక్ ఐఎఫ్‌ఎస్‌, ఖమ్మం డీఎఫ్‌వో అనుజ్ అగర్వాల్ ఐఎఫ్‌ఎస్‌, వరంగల్ డీఎఫ్‌వో బి. నిఖిత పాల్గొన్నారు.

Next Story