అధికారుల నిర్లక్ష్యం లక్షల్లో నష్టం.. మొక్కజొన్న వరి జామాయిల్ పూర్తిగా దగ్ధం

by Bhanu |

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో, లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని, వాటికి నష్టం ఎంత జరిగిందని అంచనా వేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు.

అధికారుల నిర్లక్ష్యం లక్షల్లో నష్టం.. మొక్కజొన్న వరి జామాయిల్ పూర్తిగా దగ్ధం
X

దిశ, చిట్యాల: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో, లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని, వాటికి నష్టం ఎంత జరిగిందని అంచనా వేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో చేతి కంది వచ్చిన పంట తీవ్ర నష్టం జరుగుతుంటే, విద్యుత్ వైర్ల వలన నడి వేసవిలో రైతులకు తీవ్ర నష్టాన్ని కలుగుతున్నది. శుక్రవారం గుంటూరు పల్లె గ్రామంలో తిరుమలాపూర్ శివారులో, 30 ఎకరాల్లో మొక్కజొన్న, వరి, జామాయిల్ పంటలు పూర్తిగా దగ్ధమై, రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లిందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న, విద్యుత్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందని బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు.


గుంటూరు పల్లి గ్రామానికి చెందిన, పాలెపు మాధవి రాంబాబు రైతు, గత నెల రోజుల క్రితం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా, ఎకరం 20 గుంటల భూమిలో ఎర్రచందనం, శ్రీ గంధం, జామ, మామిడి మొక్కలు నాటుకొని, గత ఆరు సంవత్సరాల క్రితం, పంట సాగు చేసుకుంటూ చేతికి వచ్చే సమయంలో, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ద్వారా కరెంటు వైర్లు తెగి, పంట పూర్తిగా దగ్ధం కాగా, ఇప్పటివరకు ఏ విద్యుత్ అధికారులు పంట నష్టం ఎంత జరిగిందని అంచనా వేయకపోవడం, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. చింతకుంట రామయ్య పల్లె లో కూడా పంట దగ్ధం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story