చెరువులో మొసలి.. భయాందోళనలో ప్రజలు..

by Disha Web Desk 11 |
చెరువులో మొసలి.. భయాందోళనలో ప్రజలు..
X

దిశ, కొత్తగూడ: కొత్తగూడ మండల పరిధిలోని ఓ చెరువులో మొసలి కలకలం రేపుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తగూడ మండల పరిధి మొండ్రాయిగూడెం గ్రామ శివారులో చెరువు ఉంది. పరిసర గ్రామ ప్రజలు పశువులను ఆ చెరువులోని నీటి కోసం తీసుకెళ్తుంటారు. కాగా బుధవారం ఉదయం మొండ్రాయిగూడెంకి చెందిన ఊర కుక్కలు ఆ మొసలిని గమనించి అరవడంతో మొసలి ఒడ్డుపై నుంచి నెమ్మదిగా చెరువులోకి జారుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మొసలి సంచరిస్తుందన్న సమాచారం స్థానికులకు తెలియడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. రోజు వారీగా చెరువుకు వెళ్లే గ్రామస్తులకు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు మొసలిని అదుపులోకి తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed