- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీపీఎం ఆకుల జనార్దన్ సేవలు చిరస్మరణీయం
by Ratna Kumari |
మండల పరిధిలోని చంద్రయ్యపల్లి గ్రామంలో సీపీఎం నాయకుడు ఆకుల జనార్దన్ 18వ వర్ధంతిని నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.

X
దిశ, గీసుగొండ : మండల పరిధిలోని చంద్రయ్యపల్లి గ్రామంలో సీపీఎం నాయకుడు ఆకుల జనార్దన్ 18వ వర్ధంతిని నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం నిరంతరం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల దాడి శివ, శ్రీనివాస్ , గంగాదేవిపల్లి సర్పంచ్ కూసం స్వరూప రమేష్, మాజీ సర్పంచ్ ఆకుల స్రవంతి రుద్రప్రసాద్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Next Story






