- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ యం.జి.యం ను సందర్శించిన సీపీ..
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, సోమవారం వరంగల్ యం.జి.యం హాస్పటల్ ను సందర్శించారు.

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, సోమవారం వరంగల్ యం.జి.యం హాస్పటల్ ను సందర్శించారు. పోలీస్ అవుట్ పోస్ట్ సందర్శించి సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ఇక్కడికి వచ్చే మెడికో లీగల్ కేసులకు సంబంధించి ఏవిధమైన చర్యలు చేపడుతున్నారో పరిశీలించారు. వీటికి సంబందించి వివరాలను నమోదు చేసే రికార్డులను చూసి వివరాలు తెలుసుకున్నారు. మత్తు పదార్ధాలకు బానిసలుగా మారిన యువతకు చికిత్స అందిస్తున్న డి అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో మత్తు పదార్ధాలకు అలవాటు పడిన యువతను సాధరణ స్థితికి తీసుకవచ్చేందు.. వైద్యులు అందిస్తున్న చికిత్స విధానాన్ని పోలీస్ కమిషనర్ కు వివరించారు. యం.జి.యం పరిసరాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ హాస్పటల్ కు సంబందించి ప్రధాన మార్గంతో పాటు, వాహన పార్కింగ్ ప్రదేశాలు,ముఖ్యమైన స్థలాల్లో సిసి కెమెరాల ఏర్పాటుపై సంబంధించిన అధికారులకు పలు సూచనలు చేశారు. యం.జి.యం లో పార్కింగ్ ఏర్పాట్లు, హాస్పిటల్ సంబందించి ప్రధాన మార్గం నుండి హాస్పటల్ కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాస్పటల్ ప్రధాన ద్వారంలో ఆటోలను నిలపకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీపీ ట్రాఫిక్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ కమిషనర్ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, యం.జి.యం సూపరింటెండెంట్ రాంకుమార్ రెడ్డి, ఏసీపీలు జితేందర్ రెడ్డి, సదయ్య, సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి ఇన్స్ స్పెక్టర్లు కరుణాకర్, రాఘవేందర్ తో పాటు ఆర్.ఎస్.ఐలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్, నాగరాజు ఉన్నారు.






