- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ను సీపీ ఆకస్మిక తనిఖీ
రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు.

దిశ, రఘునాథపల్లి : రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి, రికార్డ్ రూమ్, స్టేషన్ రైటర్ రూమ్, రిసెప్షన్ సెంటర్ ఇతర విభాగాలను తనిఖీ చేసి, వాటిని తగిన విధంగా సంరక్షించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీ కేసులు, నమోదైన కేసుల పురోగతి పై సీపీ ఆరా తీశారు. అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగు పరుచుకుని చేపట్టాల్సిన విధి విధానాలపై సంబంధిత స్టేషన్ ఎస్‌ఐ, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ లకు తగిన సూచనలు చేశారు. ప్రధానంగా ప్రస్తుతం రఘునాథ్ పల్లి మండలం దాని పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో, ప్రజలను అప్రమత్తం చేసి, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా ఫారెస్ట్ సిబ్బందితో సమన్వయం చేసుకొని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ భీం శర్మ, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర రఘునాథ్పల్లి ఎస్.ఐ దూదిమెట్ల నరేష్ దూదిమెట్ల నరేష్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






