- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన సీపీ
పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం శాంతి భద్రతలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్వీకరించారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం శాంతి భద్రతలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్వీకరించారు. ఫిర్యాదుదారుల నుంచి సమస్యలను తెలుసుకుని, వాటిని పరిశీలించిన సీపీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, పోలీసు శాఖకు చెందిన సిబ్బంది తమ శాఖాపరమైన సమస్యలకు సంబంధించి పోలీస్ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
టెక్నికల్ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వరంగల్ సీపీ
తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ డీజీపీ వి.వి. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో CCTNS 2.0, ఈ-సాక్ష్య (e-Sakshya) అప్లికేషన్లలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అప్‌డేట్లు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు, వినియోగ విధానంపై టెక్నికల్ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.






