- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి పనికి ఓ రేటు.. ఆ నాయకులకే తహసీల్దార్ మొదటి ప్రాధాన్యం..
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని ఓ మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం తాజాగా అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తోంది.

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని ఓ మండల తహసీల్దార్ కార్యాలయం తాజాగా అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తోంది. మండల ప్రజల ఆరోపణల ప్రకారం, తహసీల్దార్ కార్యాలయంలో పని చేయించాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. ఎలాంటి ధ్రువీకరణ పత్రమైనా, అడుగుతో లేదా అధికారి సూచనతో వచ్చినా, పైసా చెల్లించకపోతే పని జరగడం లేదు అంటూ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థల రికార్డులు, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, వారసత్వ సంబంధిత అంశాల్లో ఫీజు కాకుండా ఇతర చెల్లింపులు చేయాల్సిన పరిస్థితితో ప్రజలు తలపట్టుకుంటున్నారు. డబ్బు ఇవ్వకపోతే ఫైల్ కదలదు అంటూ పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొంతకాలంగా కొనసాగుతున్న విషయం అని స్థానికులు చెబుతున్నారు. కానీ దీనిపై ఎటువంటి చర్యలు లేకపోవడం విచారకరమని అధికారుల తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ తహసీల్దార్ పనులు నాయకులకే ..
పరకాల నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఆ మండల కార్యాలయ తహసీల్దార్ సామాన్య ప్రజల పనులు చేయడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఉన్నత వర్గానికి చెందిన నాయకుల పనులను పట్టించుకొని మరి ముందుండి పని చేస్తున్నారని, మండల ఆఫీసుకు వెళ్ళిన ప్రజలు ఆరోపిస్తున్నారు. నాయకులకు కుర్చీ వేసి మరి పని చేస్తున్నాడు అని, నాయకులు వెళ్తే ఎటువంటి పనైనా చేతులు తడుపుకొని మరి వేగవంతంగా పని చేస్తున్నాడని, సామాన్య ప్రజలు వెళ్తే పట్టించుకోవడం లేదంటూ మండలానికి చెందిన ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. ఆఫీసు భవనంలో బహిరంగంగా సహాయంగా డబ్బులు తీసుకునే వ్యక్తులు ఉంటారని, అంతర్గతంగా వ్యవస్థే అలా ఏర్పడుతుందని, గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు.
ఎంక్వైరీ పేరుతో వెళ్ళి డబ్బులు డిమాండ్..!
మండలంలో ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు ఇలా పలు పనుల మీద ఎంక్వేరీకి వెళ్లిన సదరు ఆర్ ఐ ఎంక్వైరీ పూర్తైన తరువాత తిరిగి వెళ్లకుండా బాధితుల ఇంటి దగ్గరే కూర్చొని, మీ పని జరగాలంటే మీరు కొంత డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ ఎంత ఇవ్వాలో కూడా సదరు బాధితులకు తెలిపి అడిగినంత ఇస్తేనే పని జరుగుద్ధి అని అంటున్నట్లు పలువురు మండల కేంద్రంలో చర్చించుకుంటున్నారు. మండలానికి చెందిన పలువురి దరఖాస్తులు కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉంటున్నాయని, ఇలా కొంతకాలంగా కొనసాగుతున్న విషయం అని స్థానికులు అంటున్నారు. ఈ తరహా వ్యవస్థ అన్యాయానికి , సామాన్య ప్రజల న్యాయ హక్కులకు ఆటంకం కలుగుతుందని, స్థానిక మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు ఆర్ ఐ తహసీల్దార్ కు ఎంత చెప్తే అంతే.. ఆర్ ఐ చెప్తే ఎంతటి పనినైనా చెయ్యకుండా తహసీల్దార్ ఆపేస్తాడు అంటూ ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. గతంలో తహసీల్దార్ దగ్గర పని చేసిన వారినే, తను చెప్తే వినే వ్యక్తులను స్థానిక ఎమ్మెల్యే పలుకుబడితో ఆ మండల కార్యాలయానికి డిప్యుటేషన్ కింద రాపించుకొని జోరుగానే కాసులతో జేబులు నింపుకుంటున్నారని, ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతు చిక్కని.. తహసీల్దార్ పనులు..
సదరు తహసీల్దార్ పనులు చేస్తే ఎంతటి వారికైనా గుర్తు పట్టడం సాధ్యం కాదు.. ఆ మాదిరిగా తహసీల్దార్ పనులు చేస్తుంటాడని, మండల కేంద్రంలో ప్రజలు జోరుగానే చర్చించుకుంటున్నారు. స్థానికంగా బలగం ఉన్న నాయకులకే తహసీల్దార్ పనులు చేస్తుంటాడని, స్థానిక ప్రజలను పట్టించుకోడని ఆరోపణలు జోరుగానే వినిపిస్తున్నాయి. ఏదైనా పని మీద వెళ్తే బ్రతిమిలాడించుకొని కూడా పని చేయకుండానే వెనక్కి పంపిస్తాడని, అదే నాయకులు వెళ్తే క్షణాల్లో చేస్తుంటాడని, నాయకులతో మండలానికి సమీపంలో ఉన్న ఓ పేరు గల్లా హోటల్లో కూర్చొని , మరి సెటిల్ మెంట్ చేసుకుని పని పూర్తి చేస్తుంటాడని, గతంలో వరంగల్ జిల్లాలోని ఓ మండలంలో పని చేసిన ఆ తహసీల్దార్ యాబై ఏళ్ళు ఉన్న వ్యక్తికి ముప్పై ఏళ్ళు అని సృష్టించి 8 లక్షలు తీసుకొని వి.ఆర్.ఏ ఉద్యోగం ఇచ్చాడంటూ వార్తల్లోకి ఎక్కాడు. అదే కోణంలో ఇప్పుడు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో పని చేస్తూ జోరుగానే వసూళ్లకు తెర లేపుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కొన్ని నెలల్లో రేటెడ్ మెంట్ అయ్యే సమయం దగ్గర పడటంతో ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.! నాయకులకు పనిచేస్తున్న తహసీల్దార్ పై ఇప్పటికైనా ఉన్నత అధికారులు తహసీల్దార్ పై నిఘా పెంచి, చర్యలు తీసుకోవాలని మండలంలోని సామాన్య ప్రజలు కోరుతున్నారు.






