కొమ్మాల అంగడిలో భవనం కాజేతకు కుట్ర ?

by Ratna Kumari |

కొమ్మాల అంగడిలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణం ఏ నిధుల నుంచి నిర్మించారో కనీసం అధికారులకు తెలియకపోవడం అనేది వారి అలసత్వానికి నిదర్శనం అని స్థానికులు విమర్శిస్తున్నారు.

కొమ్మాల అంగడిలో భవనం కాజేతకు కుట్ర ?
X

దిశ, గీసుకొండ : కొమ్మాల అంగడిలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణం ఏ నిధుల నుంచి నిర్మించారో కనీసం అధికారులకు తెలియకపోవడం అనేది వారి అలసత్వానికి నిదర్శనం అని స్థానికులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో కొమ్మాల అంగడికి వచ్చే పశువులకు పరీక్షలు నిర్వహించడానికి వీలుగా అంగడి ప్రాంతంలో రెండు రూముల రేకుల షెడ్డు నిర్మించారు. ఈ నిర్మాణాన్ని ఏ నిధుల నుంచి నిర్మించారో ఇప్పటికీ క్లారిటీ లేదు. అప్పటి సర్పంచ్ అంగీకారంతో నిర్మాణం పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మించిన రెండు రూములో వాడకంలోకి రాకపోగా.. ఓ ప్రైవేట్ వ్యక్తి దానిని అద్దెకు ఇచ్చి ధనార్జన పొందుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతటితో ఆగకుండా తానే స్వయంగా భవనాన్ని నిర్మించానని ఇప్పుడు ఆ గోపాల మిత్ర రేకుల షెడ్డు కు ఇంటి నెంబర్ ఇవ్వాలని కార్యదర్శితో మాట ముచ్చట మొదలు పెట్టాడు. కానీ కార్యదర్శి విముఖత చూపినట్టు సమాచారం. గతంలో పలు మార్లు పశు వైద్య అధికారికి అంగడి నిర్వహిస్తున్న వారం అందుబాటులో ఉండాలి కదా అని దిశ విలేకరి అడగగా.. తాను స్పందిస్తూ మేము అక్కడ ఉండటానికి వెసులు బాటుగా భవనం లేదని ,పశువులకు ఎలా పరీక్షలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. మరి ఈ షెడ్డు ను వాడుకోకుండా స్వలాభం కోసం కిరాయికి ఇవ్వడం ఏంటని ప్రజలు మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసలు ఆ షెడ్ ఏ నిధుల కింద నిర్మించారో తెలుసుకొని ప్రజల ఉపయోగార్ధంగా దానిని వాడుకలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

క్లారిటీ ఇచ్చిన కార్య‌ద‌ర్శి ప్ర‌శాంత్

ఇస్మాయిల్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి ప్రభుత్వ భూమిలో నిర్మించిన రేకుల షెడ్ కు ఇంటి నెంబర్ ఇవ్వాళ అని అడిగాడు. కానీ స్థలానికి , నిర్మాణానికి సంబంధించి పత్రాలు తీసుకురావాలని కోరాను. ఈ విషయాన్ని నేను నా పై అధికారుల దృష్టికి తీసుకువెల్లి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది అని క్లారిటీ ఇచ్చాడు.

Next Story