- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం!?
రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం అవలంబించనుంది.

దిశ, భూపాలపల్లి: రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం అవలంబించనుంది. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో మంది పోటీ చేసేవారు. ఈసారి అలా కాకుండా ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకే ఒక అభ్యర్థిని సర్పంచ్‌గా పోటీలోకి దింపాలని ఆలోచన. దానికి కొత్త రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బీ ఫాంలు ఇవ్వడం కుదరనందున కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా గ్రామాల్లో కమిటీ ఏర్పాటు చేసి అందులో ఒక్క అభ్యర్థిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలో నిలబెట్టాలని ఆలోచన చేస్తుంది. పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని కాకుండా ఎవరైనా అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేసిన, ప్రచారం చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాకుండా భవిష్యత్తులో పార్టీలోకి తీసుకునే అవకాశం లేకుండా చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది.
ఈ విషయం పై గతంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజక వర్గంలోని కాటారం సబ్ డివిజన్ పలుమార్లు పలువురికి ఈ విషయాన్ని తెలియజేశారు. కొంతమందికి హెచ్చరికలు సైతం చేశారు. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో సైతం గండ్ర సత్యనారాయణరావు ఇదే విధమైన ఆలోచన చేశారు. గ్రామాల్లో పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా ఉంటే పార్టీ బలంగా ఉండటమే కాకుండా అన్ని రకాల అభివృద్ధి పనులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటుందని నాయకుల ఆలోచన. ప్రతి అభివృద్ధి పనికి గ్రామపంచాయతీ తీర్మానంతో పాటు గ్రామంలో గ్రామంలో జరిగే ప్రతి సమావేశానికి సమావేశం సర్పంచ్ అధ్యక్షతన జరుగుతుంది. గ్రామంలో ఏ పని జరగాలన్న ఎలాంటి ఆటకం లేకుండా సర్పంచ్ అభ్యర్థి అనుకూలమైన వ్యక్తిగా ఉండాలన్నదె పార్టీ ఆలోచన.
దీనికి అనుకూలంగానే గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి నాయకులు ఇప్పటినుండే వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. దీనికోసం గ్రామాల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేయడమే కాకుండా ఇప్పటికే గ్రామాల్లో ఎవరు ప్రజల్లో ఉన్నారన్న విషయం సర్వే చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే ప్రకారం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులు నిలబెట్టి గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. మంత్రి నియోజకవర్గంలో లోని కాటారం డివిజన్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఒకే అభ్యర్థిని నిలబెట్టడం జరుగుతుందని వాస్తవం. దీనికి ఈ ప్రాంతంలో పలువురు ఆమోదం తెలియకుండా అభ్యర్థి గెలుపుకు కృషి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.






