మైన‌ర్ బాలిక పై కాంగ్రెస్ యువ‌నేత అత్యాచారం

by Ratna Kumari |

ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలమైన ఏటూరు నాగారంకు చెందిన ఓ మైనర్ బాలిక పై స్థానిక కాంగ్రెస్ యువనేత పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం.

మైన‌ర్ బాలిక పై కాంగ్రెస్ యువ‌నేత అత్యాచారం
X

దిశ‌, ఏటూరు నాగారం : ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలమైన ఏటూరు నాగారంకు చెందిన ఓ మైనర్ బాలిక పై స్థానిక కాంగ్రెస్ యువనేత పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో లైంగిక దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ యువనేతను బాలిక తల్లిదండ్రులు నిలదీయగా పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. బాధితురాలి తల్లిదండ్రులు ములుగు లోని చైల్డ్ ప్రొటెక్షన్ సంస్థను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Next Story