- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల ఆశయాలే ఏజెండాగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
బడుగు బలహీనవర్గాల ప్రజల ఆశయాల ను ఎజెండాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ఎంపీ కావ్య,మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

దిశ, లింగాలఘణపురం (రఘునాథ్ పల్లి): బడుగు బలహీనవర్గాల ప్రజల ఆశయాల ను ఎజెండాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ఎంపీ కావ్య,మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం రఘునాథపల్లి మండలం నిడిగొండ లోని, సత్య సాయి కన్వెన్షన్ హాల్లో, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో, వారు మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబమని, ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతంపైనే ప్రత్యేక దృష్టి దృష్టి పెట్టాలన్నారు.సమర్థులను ఎంపిక చేసి బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలన్నారు.నాయకత్వం పరంగా పార్టీని బలోపేతం చేయడమే నా నా సంకల్పం అన్నారు.ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి పని చేయాలే తప్ప పైరవీలు ఉండమన్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వారికి గుర్తింపు ఉంటుంది అన్నారు.పదవులకు సీనియార్టీతో పాటు సమర్థత కలిగిన అర్హులకు పదవులు అందజేయాలన్నారు.మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని, నిరాశ పడవద్దని త్వరలోనే మరో 1000 పైగా ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయన్నారు.నియోజకవర్గ అభివృద్ధి నా ఏజెండా అన్నారు.నియోజకవర్గంలో నీటిపారుదులతో పాటు, విద్యా, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు .రానున్న రోజుల్లో ప్రతి ఎకరానికి, ప్రతి గ్రామానికి సాగునీరు అందించే బాధ్యత నాది అన్నారు.
జూలై లోపు మల్లన్న గండి ఎత్తిపోతల పనులు పూర్తి చేసి, ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్నారు.బీఆర్ఎస్ పదేండ్ల పరిపాలనలో, ప్రజలకు మాయ మాటలు చెప్పింది తప్ప, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.ఒక్క ఏడాది కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు.ఎవరైతే ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటిని తిప్పి కొట్టాలన్నారు.బిఆరఎస్ బీజేపీ పార్టీలు అక్కసుతో, అహంకారంతో మాట్లాడుతున్నాయని, వారికి ప్రజల బుద్ధి చెప్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , జనగామ జిల్లా పిసిసి పరిశీలకులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, లింగం యాదవ్, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు






