- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో బలోపేతం చేయాలి : మంత్రి సీతక్క
కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో బలోపేతం చేయాలని మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు.

దిశ, ఏటూరు నాగారం : కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో బలోపేతం చేయాలని మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా యూత్ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మారం సుమన్ రెడ్డిల ఆదేశాల మేరకు మండల యూత్ అధ్యక్షులు గంట కృష్ణ రెడ్డి ఠాగూర్ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండల యువజన కాంగ్రెస్ సమావేశం యువజన కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నూతన కమిటీల ప్రక్రియ పూర్తి చేశారు. నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, మండల యూత్ అధ్యక్షులుగా నియమితులైన గంట కృష్ణ ఠాగూర్ ని శాలువతో మండల కాంగ్రెస్ పార్టీ బృందం యువజన కాంగ్రెస్ బృందం సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయిలో అహర్నిశలు కష్టపడాలని నాయకులు పిలుపునిస్తూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, మండల నాయకులు చిటమట రఘు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, ఆర్టిఏ మెంబెర్ వసంత శ్రీనివాస్, సర్పంచులు దేవులపల్లి విజయ్ కుమార్, గద్దల నవీన్, జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు సర్వ అక్షిత్, టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కి, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






