- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం కార్యక్రమాన్ని యూత్ అధ్యక్షుడు దందేరా రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

దిశ, పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం కార్యక్రమాన్ని యూత్ అధ్యక్షుడు దందేరా రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల ఇంటింట ప్రచారం చేస్తూ ఆరు పథకాల గురించి ప్రజలందరికీ తెలియజేశారు. ఆనతరం వారు మాట్లాడుతూ వచ్ఛే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మేనిఫెస్టో ఛైర్మన్ మంథని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పలిమెల మండల గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ వివరించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని విజయం సాదించిన మరుసటి రోజు నుండే పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి మరోసారి దుద్దిల శ్రీధర్ బాబును ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.






