రైతుల విషయంలో కాంగ్రెస్ హామీల అమలు విస్మరించింది : బీఆర్ఎస్ నేత‌లు

by Ratna Kumari |

రైతుల విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అన్నింటిని విస్మరించిందని, రైతులను వదిలివేసిందని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఆరోపించారు.

రైతుల విషయంలో కాంగ్రెస్ హామీల అమలు  విస్మరించింది :  బీఆర్ఎస్ నేత‌లు
X

దిశ, వరంగల్ బ్యూరో : రైతుల విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అన్నింటిని విస్మరించిందని, రైతులను వదిలివేసిందని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఆరోపించారు. రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మంగళవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి విలేకర్ల‌తో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగగా మారింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దండగ గా మారిందన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతోందన్నారు. రైతు సంగ్రామ సదస్సు కు పోటీగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మేళాలు ఏర్పాటు చేశారన్నారు. మా సదస్సుకు అనేక అవరోధాలు అడ్డంకులు సృష్టించారన్నారు. అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. రైతులకు మద్దతుగా సదస్సు పెడుతుంటే మా కార్యకర్తలు కట్టిన పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ పోరాడిందన్నారు. నాడు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అది 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందన్నారు.

కేసీఆర్ రైతులను రాజు చేయాలని చూశారన్నారు. రైతుల విషయంలో కాంగ్రెస్ హామీల అమలు అన్ని విస్మరించిందన్నారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు లేవని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. రైతుల కోసమే రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నామని దీనికి కేటీఆర్ హాజరవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరాడుతుందని.. ప్రజలకు వివరిస్తుందన్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రైతుల గోసను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతు రుణ మాఫీ కి 36,000 కోట్లు అవసరం అయితే 18,000 కోట్లు వేసి చేతులు దులుపుకున్నారన్నారు. కేసీఆర్ రైతు బంధు వరి నాట్ల ముందు ఇచ్చారని, ఇప్పుడు అతీగతీ లేదన్నారు.మొక్కజొన్న పంట కొనుగోళ్లు చేపట్టడం లేదన్నారు.దమ్ముంటే వరంగల్ మార్కెట్ కు రండి అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కొనుగోళ్లు సెంటర్ లకు వెళ్ళారా అని ప్రశ్నించారు. రైతు సమ్మేళనాలు కాదు.. రైతు సంక్షేమానికి పాటు పడాల‌న్నారు.

మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తు చేసేందుకే సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ రైతు బంధు పథకాన్ని కేంద్రం, మోడీ సర్కార్ పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ పథకాలను కేంద్రం ఇప్పటికే అమలు చేస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాల అమలు విస్మరించారన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. రైతు సంగ్రామ సదస్సుకు వచ్చే రైతుల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ రైతు సంగ్రామ సదస్సు రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతుల పంటలను కొనుగోలు చేయడం లేదన్నారు. పంటల సమయంలో యూరియా ఇవ్వలేదన్నారు.

పండిన తర్వాత పంటలను కొనుగోలు చేయడం లేదన్నారు. మొక్కజొన్న రైతులు నెల రోజులుగా పంట కొనుగోళ్ల కోసం కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారన్నారు. మాజీ శాసనసభ్యుల నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రైతుల సదస్సును విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని నాయకులను అరెస్ట్ చేసి సదస్సును కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలని చూస్తున్నారన్నారు. ఏది ఏమైనా సదస్సు నిర్వహించి తీరుతామన్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. రైతులకు కేసీఆర్ ఎంతో చేశారన్నారు. నాడు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ సమయంలో నేను రాహుల్ గాంధీ పాల్గొన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను తీసుకు వచ్చి రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీమంత్రి రాజయ్య, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, హరిరమదేవి, సాంబరి సమ్మరావు తదితరులు పాల్గొన్నారు .

Next Story