- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, నడికూడ: నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ పై దాడి జరిగింది. సోమవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ కార్యక్రమం నుండి బుర్ర దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్తుండగా నర్సక్కపల్లి స్టేజి కార్తికేయ రైస్ మిల్ దగ్గరలో సొంత గ్రామానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాగూర్ల శ్రీనివాస్,నాగుర్ల వెంకటేష్, నగేష్, వెంకటేష్, నాగుర్ల చింటూ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ను అడ్డగించి దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బుర్ర దేవేందర్ గౌడ్ భార్య నర్సక్కపల్లి మాజీ ఎంపీటీసీ బుర్ర దీప పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బూతులు తిడుతూ, బండరాయితో తలపై కొట్టగా తల పగిలి రక్తం కారి ప్రాణాపాయ స్థితిలో వున్నాడని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు.పిర్యాదు మేరకు పరకాల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.






