కేసముద్రం సభ విజయవంతం చేసిన కార్యకర్తలకు నేతల కృతజ్ఞతలు

by Bhanu |

కేసముద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా కార్యకర్తలకు గూడూరు బ్లాక్ కాంగ్రెస్

కేసముద్రం సభ విజయవంతం చేసిన కార్యకర్తలకు నేతల కృతజ్ఞతలు
X

దిశ, గూడూరు: కేసముద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా కార్యకర్తలకు గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, మాజీ సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు మండలంలోనుంచి సుమారు 4,000 మంది కార్యకర్తలు సభకు హాజరైనట్టు వారు తెలిపారు.

ఈ సభ ద్వారా మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి 400 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం శుభ పరిణామమన్నారు. కేసముద్రం తర్వాత గూడూరు మండలానికి కూడా అధిక ప్రాధాన్యత కల్పిస్తామని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిపారు. త్వరలో గూడూరు నుంచి కేసముద్రం వరకు రోడ్డు పనులు ప్రారంభం కానుండగా, నాయకపల్లి నుంచి పెనుగొండ వరకు డబుల్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఎంపీ బలరాం నాయక్ నిధులతో రూ.2 కోట్ల విలువైన సీసీ రోడ్ల పనులు గూడూరులో ప్రారంభమైనట్టు తెలిపారు. ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంతో పాటు గూడూరు మండలం అభివృద్ధి దిశగా కొనసాగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనావత్ రమేష్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కన్నబోయిన వెంకన్న, కోరే కుమారస్వామి, కందిక కృష్ణ, కోరే దేవ, హెచ్. శివ, మండల మల్లేష్, శీను, మహేష్, కందిక శంకర్, వాంకుడోత్ చందు తదితరులు పాల్గొన్నారు.


Next Story