సర్వేలతో భయపడుతున్న కాంగ్రెస్

by Ratna Kumari |

కేసముద్రం లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరవుతున్న వేళ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.

సర్వేలతో భయపడుతున్న కాంగ్రెస్
X

దిశ, కేసముద్రం : కేసముద్రం లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరవుతున్న వేళ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ప్రత్యేకంగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు సర్వేలను చూసి బెంబేలు ఎత్తుచున్నారు. దీంతో కాంగ్రెసు అధిష్టానం కేసముద్రం పై ప్రత్యేక దృష్టి పెట్టింది. కొన్ని వార్డుల్లో పెద్ద పెద్ద నాయకులు పోటీ చేస్తుండటం తో ఉత్కంఠత బాగా పెరిగింది. బలం ఉన్న నాయకులు భయపెడుతూ, లేదా సానుభూతి కొరకు ఏడుస్తూ.. ఓటు బ్యాంకు గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఓటర్ నాడిని అందుకోలేక అన్ని పార్టీల నాయకులు టెన్షన్ పడుతున్నారు. చివరికి సర్వేలు నిజమవుతాయా? లేక తలకిందులు అవుతాయా అనేది వేచి చూద్దాం.

Next Story