ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

by Ratna Kumari |

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన టీజీ ఆర్టీసీ కార్మికులకు బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు.

ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన టీజీ ఆర్టీసీ కార్మికులకు బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రావు పద్మా రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఎన్నో ఆశలు చూపి, వందలాది హామీలను ఇచ్చింది. తీరా గద్దెనెక్కిన తర్వాత ఆ హామీలను అటకెక్కించి కార్మికులను నట్టేట ముంచింది అని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం వారిని వంచిస్తోంది. ఇది ముమ్మాటికీ ఆర్టీసీ కార్మికులకు చేసిన ద్రోహమే అని, సమ్మె వల్ల సామాన్య ప్రజలు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఈ మొండి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి స్పష్టం చేశారు.న్యాయమైన డిమాండ్లు తీరే వరకు కార్మికుల పక్షాన తమ పోరాటం ఆగదు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరిని వీడకుంటే బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అని రావు పద్మ రెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా పగడాల కాళీప్రసాద్ రావు, కార్పొరేటర్ చాడ స్వాతి, కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story