- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాజీపేటలో ఓటు చోరీపై కాంగ్రెస్ సంతకాల సేకరణ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఓటు చోరీ పై బూత్, డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకుల

దిశ, వరంగల్ బ్యూరో : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఓటు చోరీ పై బూత్, డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి సంతకాలని సేకరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోవడం అని అన్నారు. బీజేపీ, BRS పార్టీలు గతంలో ఓట్లను అపహరించాయని, శాసన సభ ఎన్నికల్లో,పార్లమెంట్ ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని చెప్పారు.ప్రజలందరు మాకెందుకు అనుకుంటే బిజెపి ప్రభుత్వం ఈసీ తో కలిసి మన ఓట్లను చోరీ చేస్తున్నదని గుర్తు చేశారు.
గడిచిన చాలా కాలంగా రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాల్పడిన ఓట్ల చోరీపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తూ,మతపరమైన రాజకీయాలకు పాల్పడుతున్నదని అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం,ఈసీ సరైన సమాధానం చెప్పలేదని వారు మండిపడ్డారు. ఓటు చోరీలు, ఈసీ పాక్షిక వైఖరికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ స్వరం కలిపి పోరాటం చేయాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణిచివేయాలని చూస్తోందని తెలిపారు.






