- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి కమ్యూనిస్టు నేత కూసం రాజమౌళి మృతి
గంగాదేవిపల్లి గ్రామాన్నీ ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దిన ఘనుడు మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఆకస్మికంగా మృతి చెందారు. ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురైన రాజమౌళిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు తెలిపారు

దిశ , గీసుకొండ : గంగాదేవిపల్లి గ్రామాన్నీ ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దిన ఘనుడు మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురైన రాజమౌళిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. రాజమౌళి మరణ వార్తతో గంగాదేవిపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం సర్పంచ్ లకు ట్రైనింగ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మనకీ బాత్ లో మోడీ రాజమౌళి పేరును ప్రస్తావించడం జరుగుతుంది. భారత దేశ ప్రతినిధిగా శ్రీలంకలో గ్రామీణ అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం మంచినీటి వాడకంపై కార్యక్రమంలో పాల్గన్నారు.
రాజమౌళి ఒక పర్యాయం సర్పంచ్ పదవిని నిర్వహించి ప్రజలకు సేవలందించారు. రెండు పర్యాయాలు ఊకల్ సహకార సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించి రైతుల అభివృద్ధికి కృషి చేశారు. తను సర్పంచ్ గా కొనసాగుతున్న సమయంలో గంగాదేవిపల్లి గ్రామాన్ని అభివృద్ధి పరిచి జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా నిలిపిన తన సత్తా చాటారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఎంసీపీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఓంకార్‌కు మంచి సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. శాయంపేట నియోజకవర్గంలో ఎంసీపీఐ పార్టీ నుంచి ఒక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రాజమౌళి మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.






