- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి, మనం బాగుండాలంటే దిన చర్యలో మార్పు అవసరమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్. శ్వేత అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి, మనం బాగుండాలంటే దిన చర్యలో మార్పు అవసరమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్. శ్వేత అన్నారు. పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను ఆమె పర్యవేక్షించారు. సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణ, నిబద్ధత, శారీరక దృఢత్వంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామం, యోగాను అలవాటు చేసుకోవాలని తెలిపారు. "పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మరింత సమర్థవంతమైన సేవలు అందించగలుగుతారు" అన్నారు. క్రమశిక్షణే పోలీసు వ్యవస్థకు పునాది అన్నారు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీ లు అంతయ్య, సత్యనారాయణ, ఆర్.ఐ లు స్పర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, చంద్రశేఖర్, ఉదయ్ భాస్కర్, ఇన్స్ స్పెక్టర్లు వెంకన్న, సువర్ణ, సుజాత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






