రూ.16.10 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీతకు పనుల ప్రారంభం

by Ratna Kumari |

వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన భద్రకాళి చెరువు పునరుద్ధరణకు మరోసారి శ్రీకారం చుట్టామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

రూ.16.10 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీతకు పనుల ప్రారంభం
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన భద్రకాళి చెరువు పునరుద్ధరణకు మరోసారి శ్రీకారం చుట్టామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఇప్పుడు రూ.16.10 కోట్ల నిధులతో సమగ్రంగా చెరువు పూడికతీత పనులను చేపడుతున్నామని తెలిపారు.శుక్రవారం 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, నగర మేయర్ గుండు సుధారాణిలతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఎలాంటి అంతరాయాలు లేకుండా చెరువు పునరుద్ధరణ, మాడ విధుల పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా ఓటు బ్యాంకు రాజకీయాలు చూడలేదని స్పష్టం చేశారు.ప్రతిపక్ష పార్టీ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే తమకు చెడ్డపేరు వస్తుందనే భయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సమిష్టి నాయకత్వంతో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మామిండ్ల రాజు, అధికారులు పాల్గొన్నారు.

Next Story