- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి : మంత్రి సీతక్క
కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి : మంత్రి సీతక్క
by Ratna Kumari |
జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులకు, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

X
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులకు, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మున్సిపల్ చైర్మన్ చింతన చంద్రకళ బిక్షపతి లతో కలసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని నిర్మాణ పనులను నాణ్యత పూర్తి చేయాలని, అనుకున్న సమయానికి ముందుగానే అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులు, గుత్తేదారు చోరువ చూపాలని ఆదేశించారు. మంత్రి వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Next Story






