ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ఫ్యాను తీసుకెళ్లాలి.. దిశ కథనానిక స్పందన

by Bhanu |   (  Updated:2025-05-20 11:28:07  IST  )

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నీ మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ఫ్యాను తీసుకెళ్లాలి.. దిశ కథనానిక స్పందన
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నీ మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ బ్లాక్, యూరాలజీ బ్లాక్, జనరల్ వార్డ్, పరిసరాలను, హాస్పటల్ ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్, డాక్టర్స్ సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న పేషెంట్లకు అందిస్తున్న సేవల వివరాలు సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ లను అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రిలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందించాలని, హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు,సదరం క్యాంపుల నిర్వహణ (వైద్య పరీక్షల) కోసం ఆస్పత్రిలో అనువైన ప్రదేశంలో వారి కి సేవలు అందించడానికి యుఐడి (బ్లాక్) నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు,స్పెషలైజేషన్ మానసిక, కంటి, చెవి, ముక్కు, దంతాల, విభాగం తదితర వినికిడి లోపం ఉన్న వారిని పరీక్షల కోసం తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రికి వచ్చే పేషెంట్,లకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా స్వచ్ఛమైన పదార్థాలను అందించాల న్నారు,ఆస్పత్రిలో పార్కింగ్, వైద్య విభాగాలు , సానిటేషన్ నిర్వహణ తదితరాంశాలపై కలెక్టర్ తగు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిఈ, ఏఈ, శంకర్, సంబంధిత విభాగాల సిబ్బంది ఉన్నారు.

Next Story