- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమ్మాల జాతర బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సత్య శారద సమీక్ష
గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో వరంగల్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు.

దిశ, వరంగల్ బ్యూరో : గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో వరంగల్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 3 నుంచి మార్చి 8 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలీస్, ఆరోగ్య, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ, పౌర సంబంధాల, అగ్నిమాపక శాఖలు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణలు, చలువ పందిళ్లు, క్యూ లైన్లు, త్రాగునీటి సదుపాయం, అన్నదాన కార్యక్రమాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, వైద్య శిబిరాలు, శానిటేషన్ చర్యలు సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారిని సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, ఆర్డీవో సుమ, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






