Collector Pravinya : అంగన్వాడీ కేంద్ర పనులను త్వరగా పూర్తి చేయాలి

by Chintha Aamani |

పలి వేల్పుల లోని అంగన్వాడీ కేంద్రం ఉన్నతీకరణ లో

Collector Pravinya : అంగన్వాడీ కేంద్ర పనులను త్వరగా పూర్తి చేయాలి
X

దిశ,హనుమకొండ టౌన్ : పలి వేల్పుల లోని అంగన్వాడీ కేంద్రం ఉన్నతీకరణ లో భాగంగా చేయుచున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. బుధవారం హన్మకొండలోని పలివెల్పు ల డివిజన్ 1 లో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అంగన్వాడీలను ఉన్నతీ కరించడంలో భాగంగా ఇక్కడ జరుగుతున్న మైనర్ రిపేర్లు, టాయిలెట్లు నిర్మాణం, రంగులు వేయడం లను పరిశీలించారు. మైనర్ రిపేర్ లు ఏమైనా ఉంటే త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ సిబ్బందిని ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో ముఖాముఖిగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, ఇన్చార్జి డి డబ్ల్యు ఓ భాగ్యలక్ష్మి, సీడీపీఓ విశ్వజ, ఏఈ రవీందర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story