భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

by velandi.Saikiran |

వర్షం కారణంగా మండలంలోని తాడిచర్ల ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి
X

దిశ, మల్హర్: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మండలంలోని తాడిచర్ల ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో చేపడుతున్న ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ ఓపెన్ కాస్ట్ లోకి భారీగా వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రోజుకు లక్ష మెట్రిక్ టన్నుల ఓబీ మట్టి పనులు, ఆరు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పనులు జరుగుతుండగా మూడు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 18 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు, మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓబీకి మట్టి పనులకు అంతరాయం ఏర్పడిందని ఏఎమ్మా ర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కోల్ మైనింగ్ మేనేజర్ శ్రీనివాస్ మంగళవారం పేర్కొన్నారు. ఓపెన్ కాస్ట్ లో వాహనాలు తిరిగే రోడ్లన్నీ బురదమయం కావడం ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరి చెరువులా మారడం వల్ల యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Next Story