ఆ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు సీఎం రేవంత్‌ రెడ్డి

by Malleboina Mahesh |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జ‌న‌గామ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించ‌నున్నారు. రూ.800 కోట్లతో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు.

ఆ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు సీఎం రేవంత్‌ రెడ్డి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జ‌న‌గామ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించ‌నున్నారు. రూ.800 కోట్లతో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు. ముఖ్యమంత్రి ప‌ర్యట‌న నేప‌థ్యంలో ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, వ‌రంగ‌ల్ ఎంపీ క‌డియం కావ్య, జిల్లా క‌లెక్టర్ రిజ్వాన్ బాషా స్వయంగా ఏర్పాట్లను ప‌ర్యవేక్షిస్తున్నారు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ మునిసిపాలిటీ ప‌రిధిలోని శివుని ప‌ల్లిలో జ‌రిగే ప్రజా పాల‌న ప్రగ‌తి బ‌హిరంగ స‌భ జ‌రిగే స్థలాన్ని క‌డియం శ్రీహ‌రి, కావ్య, క‌లెక్టర్ టీఎస్ఎస్పీడీసీఎల్, సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, సీఎంఓ భద్రతా బృందాలు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ శివునిపల్లి వద్ద ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో పెంబర్తి హస్తకళలు, సిలికాన్ కాటన్ టెక్స్టైల్, ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాళ్లు, మహిళా, శిశు సంక్షేమ శాఖ, విజయ డెయిరీ, ఉద్యాన వన శాఖ స్టాళ్లతో కలిపి మొత్తం ఆరు స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక మహిళా సమాఖ్యలకు బస్సుల పంపిణీ కార్యక్రమం ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపీరాం, వెంకన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ సీఎం ప‌ర్యట‌న‌ షెడ్యూల్‌..!

ఆదివారం మధ్యాహ్నం 12:10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1 గంటకు ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గంలోని శివునిపల్లి హెలీప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. 1:10 నుంచి 1:20 వరకు ఇందిరా మహిళా శక్తి బస్సులు - స్వయం సహాయక సంఘాల స్టాల్స్ సందర్శన, అనంతరం 1:25 నుంచి 3 గంటల వరకు ప్రజాపాలన కార్యక్రమ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 3:10 గంటలకు సభ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యి 3:45 కి హైదరాబాదుకు చేరుకుంటారు.

ముఖ్యమంత్రి పర్యటన వేళ ట్రాఫిక్ రూల్స్ ఇలా..

దిశ, జనగామ: ఘనపూర్ నియోజకవర్గంలోని శివుని పల్లి వద్ద సీఎం బహిరంగ సభ ఉన్నందున వాహనదారులకు పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. లింగాల గణపురం మండలంలోని మొత్తం గ్రామాలు నెల్లుట్ల, కుందారం, కోలుకొండ, ఈరంటి, గూడూరు, ఇప్పగూడెం నుంచి వచ్చే వాహనాలు లక్ష్మీ వెంచర్ లో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రఘునాథ్‌పల్లి మండలం లోని కోమల్ల , గోవర్ధనగిరి, కుర్చపల్లి గ్రామాల నుంచి వచ్చే వాహనాలు వయా రాఘవపూర్, కుర్చపల్లి, ఇప్పగూడెం నుంచి లక్ష్మీ వెంచర్ లోకి పార్కింగ్ చేసుకోవాలి . రఘునాథపల్లిలోని మిగతా గ్రామాల నుంచి వచ్చే వాహనాలు వయా రఘునాథపల్లి, కంచనపల్లి, ఈరెంటీ, గూడూరు, ఇప్పగూడెం నుంచి లక్ష్మీ వెంచర్ లోకి పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్గన్పూర్ మండలంలోని ఇప్పగూడెం, కోమటి గూడెం, రంగరాయ గూడెం, సముద్రాల గ్రామాల నుంచి వచ్చే వాహనాలు వయా ఇప్పగూడెం నుంచి లక్ష్మీ వెంచర్ లో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టేషన్గన్పూర్ మండలంలోని చాగల్ కొత్తపల్లి, తాడికొండ, మీదికొండ, రాఘవపూర్ గ్రామాల నుండి వచ్చే వాహనాలు వయా రాఘవపూర్, కూర్చేపల్లి, ఇప్పగూడెం నుంచి లక్ష్మీ వెంచర్లు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్గన్పూర్ మండలంలోని తానేదార్పల్లి నుంచి వచ్చే వాహనాలు లక్ష్మీ వెంచర్లు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.స్టేషన్గన్పూర్ మండలంలోని మిగతా గ్రామాల నుంచి వచ్చే వాహనాలు వయా స్టేషన్ ఘన్పూర్ నుంచి లక్ష్మీ రైస్ మిల్ వెనుక భాగంలో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.జాఫర్ గడ్ మండలంలోని జాఫర్గఢ్ ,ఉప్పుగల్, తిమ్మంపేట, తెలుగు తమ్మడపల్లి, సాగరం, రేగడి తాండ, రఘునాథపల్లి, ఓబులాపూర్, కోణాయిచలమా, దురియతాండ, తిమ్మాపూర్ గ్రామాల నుంచి వచ్చే వాహనాలు లక్ష్మీ రైస్ వెనుక భాగంలో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

జాఫర్గఢ్ మండలంలోని షా పల్లి, హిమ్మత్ నగర్ గ్రామాల నుండి వచ్చే వాహనాలు వయా గూడూరు, ఇప్పగూడెం నుంచి లక్ష్మీ వెంచర్ల పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జాఫర్గడ్ మండలంలోని తీగారం సూరారం, మాగ్దూంతాండ నుంచి వచ్చే వాహనాలు వయా గూడూరు ఇప్పగూడెం నుంచి లక్ష్మీ వెంచర్ లో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిల్పూర్ ,ధర్మసాగర్ మండలం, వేలేరు మండలంలోని , అయినవోలు అన్ని హనుమకొండ వైపు నుంచి వచ్చే వాహనాలు వయా స్టేషన్గన్పూర్ నుంచి లక్ష్మీ రైస్ మిల్లు వెనుక భాగంలో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తులో ముగ్గురు డీసీపీలు, ఇద్దరు అడిషనల్ డీసీపీలు , 20 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, మొత్తం 850 పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తును పటిష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను గమనించి ప్రజలు, నాయకులు సహకరించాలని పోలీస్ శాఖ కోరుతుంది.

Next Story