టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. పలువురికి గాయాలు

by Bhanu |

టాటా ఏస్ వాహనాన్ని, ఒక టిప్పర్ ఢీకొనగా పలువురికి గాయాలయ్యాయి.

టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. పలువురికి గాయాలు
X

దిశ, చిట్యాల: టాటా ఏస్ వాహనాన్ని, ఒక టిప్పర్ ఢీకొనగా పలువురికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రపురం గ్రామ శివారులో టాటా ఏస్ వాహనాన్ని ఒక టిప్పర్ ఢీకొనగా పలువురు గాయాలయ్యాయని, టాటా ఏస్ లోనీ వారు ఓదెల మండలం చిన్న కొమురే గ్రామానికి చెందిన వారు. పదిమంది టాటా ఏస్ వాహనంలో చిన్న కొమిరే గ్రామం నుండి, భూపాలపేల్లికి వివాహా నిమిత్తం వెళుతున్న క్రమంలో, రామచంద్రపురం దాటగా,భూపాలపల్లి నుండి వస్తున్న ఒక టిప్పర్ అతివేగంగా, అజాగ్రత్తగా వస్తూ, టాటా ఏస్ వాహనంను ఢీకొట్టగా, అందులో ఉన్న వారు కింద పడగా, జంగా మధు, పిల్లి శ్రీనివాస్ తోట్ల కొమరమ్మ, స్వామి, రజిత లకు స్వల్ప గాయాలయ్యాయి. తోట్ల సునీత, ముత్యాల రాజమ్మకు తీవ్ర గాయాలు అవడంతో, మెరుగైన వైద్య చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించామని. యాక్సిడెంట్ కు కారణమైన టిప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story