ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హానికి నిప్పు

by Ratna Kumari |   (  Updated:2025-12-31 07:49:34  IST  )

దిశ, వర్థన్నపేట : ఆవిష్కరణకు ముస్తాబైన చత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన సంఘటన రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హానికి నిప్పు
X

దిశ, వర్థన్నపేట : ఆవిష్కరణకు ముస్తాబైన చత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన సంఘటన రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి వేళలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించడంతో విషయం తెలుసుకున్న ఎస్సై రాజేందర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఎవరు ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని ఆయన గ్రామస్తులకు తెలిపారు

Next Story