కొనుగోలులో చిటకోడూరు కేంద్రం రికార్డ్..

by Bhanu |

ఆరుగాలం శ్రమించి కష్టపడి సాగు చేసే రైతులకు అండగా ఉండి వారు పండించిన ధాన్యం కి మద్దతు ధర ఇస్తూ కేంద్రాలకి వచ్చే ప్రతీ గింజను కొనుగోలు చేయాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.

కొనుగోలులో చిటకోడూరు కేంద్రం రికార్డ్..
X

దిశ, జనగామ: ఆరుగాలం శ్రమించి కష్టపడి సాగు చేసే రైతులకు అండగా ఉండి వారు పండించిన ధాన్యం కి మద్దతు ధర ఇస్తూ కేంద్రాలకి వచ్చే ప్రతీ గింజను కొనుగోలు చేయాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా లో సన్న రకం, దొడ్డు రకం ధాన్యలకు గాను ఐకేపీ, పి ఏ సి ఎస్ కలిపి మొత్తం 258 కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి సజావుగా ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు.జిల్లా లోని అన్ని కేంద్రాలలో కంటే స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఈసారి సీజన్ లో రికార్డ్ సృష్టించిందన్నారు.గత సంవత్సరం రబీ సీజన్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి. ఎస్ చౌహన్ జిల్లాలోని పెంబర్తి, నెల్లుట్ల, మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన చీటకోడూరు ధాన్యం కొనుగోలు కేంద్రాలని సందర్శించారని అక్కడ ఉత్పనమైన సమస్య ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారని ఆ సమస్య లు మళ్ళీ ఎదురుకాకుండా తీసుకోవలిసిన జాగ్రత్త లను, చేపట్టాలిసిన చర్యలను అధికారులకు కమిషనర్ వివరించారన్నారు. కమిషనర్ ఇచ్చిన సూచనలు, సలహాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సీజన్ లో కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా... ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లా లో సాఫిగా సాగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.చీటకోడూరు కొనుగోలు కేంద్రం కి సంబందించి రబి సీజన్ 2023 -2024 సంవత్సరం లో 177 మంది రైతుల వద్ద నుండి 11104 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా ... ఖరీఫ్ 2024-25 సంవత్సరం లో 192 మంది రైతుల నుండి 12990 క్వింటాళ్ల అలాగే రబి 2024-25 సంవత్సరం లో 497 మంది రైతుల నుండి ఇప్పటి వరకు 38104 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల జిల్లా లో అత్యధికముగా ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రం గా రికార్డు సృష్టించిందన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతులు పండించిన ప్రతీ గింజ ను కోనేంత వరకు అధికారులు పర్యవేక్షణ చేస్తూ సాఫిగా కొనుగోలు ప్రక్రియ ముగిసే వరకు అకాల వర్షాలకు అప్రమత్తం గా ఉంటు రైతులకు అండగా ఉండాలని కలెక్టర్ జిల్లా యంత్రాంగానికి సూచించారు.

Next Story