ప్రేమ పేరుతో మోసం.. యువ‌తి పై లైంగిక దాడి

by Ratna Kumari |

ప్రేమిస్తున్నాన‌ని.. పెళ్లి చేసుకుంటాన‌ని ఓ యువ‌తిని న‌మ్మించి లైంగిక దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న గీసుకొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ప్రేమ పేరుతో మోసం.. యువ‌తి పై లైంగిక దాడి
X

దిశ, గీసుగొండ : ప్రేమిస్తున్నాన‌ని.. పెళ్లి చేసుకుంటాన‌ని ఓ యువ‌తిని న‌మ్మించి లైంగిక దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న గీసుకొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. సీఐ విశ్వేశ్వ‌ర్ క‌థ‌నం ప్రకారం.. మనుగొండ గ్రామానికి చెందిన ఉదయ్ శంకర్ బాధితురాలితో పదో తరగతి నుంచి పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి బెదిరింపులకు గురి చేసి పలుమార్లు బలవంతంగా శారీరకంగా కలిశాడు. పెళ్లి విషయం అడగ‌గానే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు.


24-04-2026 రాత్రి బాధితురాలి ఇంట్లో అక్రమంగా ప్రవేశించగా స్థానికులు పట్టుకున్నారు. మరుసటి రోజు బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు నిందితుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా నిందితుడు, అతని తండ్రి సమ్మయ్య, అక్క అన్నపూర్ణ కలిసి దూషించి బెదిరించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని ఊకల్లు క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Next Story