- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంట సేపటికే గందరగోళం..!
by Elthuri vijay kumar |
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 45 నిమిషాలు కురిసిన కుండపోత వర్షానికి మండల కేంద్రంలో పరిస్థితి గందరగోళంగా మారింది.

X
గంట సేపటికే గందరగోళం..!
- కుండపోతతో గుండెకోత
- మునిగిన లోతట్టు ప్రాంతాలు
దిశ, మంగపేట : శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 45 నిమిషాలు కురిసిన కుండపోత వర్షానికి మండల కేంద్రంలో పరిస్థితి గందరగోళంగా మారింది. శుక్రవారం మండల కేంద్రంలో సంత ఉండడంతో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్సానికి సంత విక్రయానికి తెచ్చిన వ్యాపారుల కూరగాయలు, ఎండు చాపలు, పండ్లు, ఆకు కూరలు, మసాలా దినుసులు మొత్తం వర్షానికి తడిసి కొట్టకపోయినంత పని కావడంతో వ్యాపారులు నష్టపోయి గుండె కోతకు గురయ్యారు. భారీ వర్షానికి మండల కార్యాలయం పక్కన నిర్మిస్తున్న బస్ స్టేషన్లో వర్షం నీరు నిలిచి పనులకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు కొద్ది సేపు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడ్డారు. 6 గంటలకే వాన ఆగిపోయి వెలుగు రావడంతో సంతలోని వ్యాపారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






