మండ‌ల పార్టీ కాంగ్రెస్ అధ్య‌క్షులు మార్పు

by Ratna Kumari |

భూపాల్ పల్లి జిల్లాలోని 12 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మార్పునకు రంగం సిద్ధమైంది.

మండ‌ల పార్టీ కాంగ్రెస్ అధ్య‌క్షులు మార్పు
X

దిశ‌, భూపాల‌ప‌ల్లి ప్ర‌తినిధి : భూపాల్ పల్లి జిల్లాలోని 12 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మార్పునకు రంగం సిద్ధమైంది. మండల పార్టీ అధ్యక్షులుగా రెండు సంవత్సరాల కాలం పని చేసిన వారిని తొలగించి వారి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరపాటు పార్టీకి అంకితం గా పని చేసే వారికి మండల అధ్యక్షులుగా పదవి అప్పజెప్పేందుకు పార్టీ సిద్ధమైంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు అందజేయనున్నారు. జిల్లాలో 12 మండలాలకు పార్టీ అధ్యక్షులు గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నారు. పాత వారిపట్ల మండల స్థాయిలో కొంతమంది పై వ్యతిరేకత ఉన్నప్పటికీ శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, గ్రామపంచాయతీ ఎన్నికలు జరగడంతో మండల పార్టీ అధ్యక్షులను మార్చలేదు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించడంతో జిల్లా కార్యవర్గం రద్దయింది. దీంతో జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్రంలో 14 జిల్లాల కార్యవర్గాన్ని ప్రకటించి మిగిలిన 29 జిల్లాలకు కార్యవర్గాన్ని ప్రకటించలేదు.

రెండు మూడు రోజుల్లో భూపాలపల్లి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడంతో పాటు 12 మండలాలకు మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించే అవకాశం ఉంది. భూపాల్ పల్లి జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు 7 మండలాలు ఉండగా.. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ మంథని పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఏడు మండలాల అధ్యక్షులు గండ్ర సత్యనారాయణ రావు కనుసైగలలో జరగగా ఐదు మండలాలు మాత్రం మంత్రి శ్రీధర్ బాబు సూచించిన వారికి దక్కుతాయనేది నగ్నసత్యం. దీంతో మండల అధ్యక్షు పదవి ఆశించే ఆశవాలు మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ్యులు గండ సత్యనారాయణ రావు ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీలోకి చేరిన వారికి ఈ దఫా కాంగ్రెస్ పార్టీ కమిటీలలో స్థానం దక్కకపోవచ్చు. కనీసం మూడు సంవత్సరాల పాటు పార్టీకి పనిచేసిన వారికే పదవి ఇవ్వాలనే నిబంధన అధిష్టానం విధించడంతో చాలామంది ఆశాభావులకు భంగం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచన ఉన్నట్టు తెలిసింది. పార్టీ కిఅంకితభావంతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ అవకాశం దక్కేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో చాలామంది ఆశవాహులు మండల పార్టీ అధ్యక్షుడు పదవి కోసం డిసిసి కమిటీల స్థానం కోసం దిగబడుతున్నారు. పార్టీలో పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ్యులు గండ సత్యనారాయణ రావు ఆశీస్సులు ఉన్నవారికి మండల పార్టీ అధ్యక్ష పదవులు డీసీసీ కమిటీలో చోటు లభించే అవకాశం ఉంది.

Next Story