బస్సు రద్దుతో ప్రజల ఇబ్బందులు

by Elthuri vijay kumar |

జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వడ్లకొండ – కేసిరెడ్డిపల్లి – పికెట్ మార్గంలో రోజు వారీగా నడిచే ఆర్టీసీ బస్సు గత వారం రోజులుగా రద్దు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ బస్సు రద్దుతో గ్రామాల నుండి సికింద్రాబాద్‌కు ప్రయాణించే వారికి రోజువారీగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సు రాకపోవడంతో కేసిరెడ్డిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున జనగామ డిపోకు వెళ్లి డిపో మేనేజర్ స్వాతిని కలిశారు.

బస్సు రద్దుతో ప్రజల ఇబ్బందులు
X

బస్సు రద్దుతో ప్రజల ఇబ్బందులు

–డిపో మేనేజర్ ను కలిసిన కేసీరెడ్డిపల్లి గ్రామస్తులు

-ఈరోజు నుంచే బస్సును పున:ప్రారంభిస్తామని డీఎం హామీ

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

దిశా, బచ్చన్నపేట: జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వడ్లకొండ – కేసిరెడ్డిపల్లి – పికెట్ మార్గంలో రోజు వారీగా నడిచే ఆర్టీసీ బస్సు గత వారం రోజులుగా రద్దు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ బస్సు రద్దుతో గ్రామాల నుండి సికింద్రాబాద్‌కు ప్రయాణించే వారికి రోజువారీగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సు రాకపోవడంతో కేసిరెడ్డిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున జనగామ డిపోకు వెళ్లి డిపో మేనేజర్ స్వాతిని కలిశారు. తమ సమస్యలను వివరించి, బస్సును తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన డిపో మేనేజర్, అదే రోజు నుంచే బస్సును మళ్లీ నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు డీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి, కాపర్తి హరిప్రసాద్, శ్రీనివాస్, నల్లగొప్పుల బాలరాజ్, బైరగోని రవి, తిరుపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story