- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాకలి ఐలమ్మ కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని వీరనారి అయిలమ్మ మెమోరియల్

దిశా, ములుగు : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని వీరనారి అయిలమ్మ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ దళపతి (చలపతి), జిల్లా అధ్యక్షులు పర్వతాల దయాకర్ అన్నారు. గురువారం ఫౌండేషన్ ఆధ్వర్యంలోనీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద మంత్రి సీతక్క, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చేతుల మీదుగా ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు.
2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి జీవో జారీ చేసిందని వివరించారు. జీవో ప్రకారం ఈ నెల 10, 26వ తేదీలలో నిర్వహించనున్న జయంతి వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని వారు కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వడిగే సురేష్, కోశాధికారి ముక్కెర ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.






