ఆ గ్రామానికి సర్పంచ్ ఎవరు ?

by velandi.Saikiran |

సర్పంచుల ప్రమాణ స్వీకారం వేళ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయతీ లో విచిత్ర ఘటన

ఆ గ్రామానికి సర్పంచ్ ఎవరు ?
X

దిశ, మహాబూబాబాద్/గూడూరు: సర్పంచుల ప్రమాణ స్వీకారం వేళ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయతీ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నేనే సర్పంచ్ ను నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఇరువురు ఆహ్వానాలు పంపుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇదేకాక తాము ఎన్నికల్లో విజయం సాధించినట్లు ఇరువురు ధ్రువపత్రాలు సైతం చూపుస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే... మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గూడూరు మండలం దామరవంచ గ్రామపంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు దారి తీసాయి. మొదటగా బీఆర్ఎస్ మద్దతు దారు నునావత్ స్వాతి మూడు ఓట్లతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఐతే రీకౌంటింగ్ జరపడంతో కాంగ్రెస్ మద్దతు దారు సనాప సుజాత కేవలం ఒక్క ఓటుతో గెలుపొందినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. రిటర్నింగ్ అధికారి మాత్రం, కాంగ్రెస్ మద్దతు దారు సనాప సుజాత గెలిచినట్లు నిర్ధారించడం జరిగిందని తెలిపారు.

Next Story