ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-16 03:45:19  IST  )

మండలంలోని పలువురు అధికారుల సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తమ అధికారులుగా ప్రశంసా ప్రతాలను అందజేసింది.

ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు
X

దిశ, మంగపేట: మండలంలోని పలువురు అధికారుల సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తమ అధికారులుగా ప్రశంసా ప్రతాలను అందజేసింది. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఎంపీడీవో భద్రు, ఎంపీవో శ్రీనివాస్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో అంకూస్, మల్లూరు పంచాయతీ కార్యదర్శి, అజ్మత్, నర్సాపురం బోరు పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మీలు ప్రశంసా పసత్రాలను అందుకున్నారు.

Next Story