Uber : ఉబర్ కు కేంద్రం నోటీసులు

by Muthe.Rajitha |

క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ ఇండియా(Uber India)కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.

Uber : ఉబర్ కు కేంద్రం నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ ఇండియా(Uber India)కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఉబర్ ప్రవేశ పెట్టిన 'అడ్వాన్స్ టిప్'(Advance Tip) ఫీచర్‌ను అనైతిక పద్ధతిగా పేర్కొంటూ కేంద్ర వినియోగదారుల రక్షణ అధికార సంస్థ (CCPA) నోటీసులు పంపింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు రైడ్ బుక్ చేసే సమయంలో స్పీడ్ పికప్ కోసం ముందస్తుగా రూ.50, రూ.75, లేదా రూ.100 టిప్‌ను ఎంచుకోమని సూచించబడుతుంది. ఈ ఫీచర్ అన్యాయమంటూ వినియోగదారులు భారీగా ఫిర్యాదులు చేయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా CCPA ఉబర్ నుంచి వివరణ కోరింది. సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఉబర్ ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు. గతంలో కూడా ఉబర్, ఓలా రైడ్‌లలో ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు భిన్నమైన ధరలను విధిస్తోందని ఆరోపణలపై CCPA నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Next Story