- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి: కలెక్టర్ శశాంక
ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.

దిశ, మహబూబాబాద్ టౌన్: ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలోని మీటింగ్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా మహిళా డాక్టర్లు పనిచేసే పీహెచ్ సీలు ఎంపిక చేయడం జరిగిందన్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలో కురవి, దంతాలపల్లి అలాగే మహబూబాబాద్ నియోజకవర్గంలో అయోధ్యపురం, ములుగు నియోజకవర్గంలో గంగారం, పాలకుర్తి నియోజకవర్గం లో తొర్రూరు ఉన్నాయన్నారు. స్థానిక శాసనసభ్యుల ద్వారా మహిళలను సన్మానించుకోవడం జరుగుతుందన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని 5 పీ హెచ్ సీలలో ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. అదే రోజు మహిళలకు 8 రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్ జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీఏపీడీ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.






